Editors Note : Sridhar Deshpande
Support ‘Telangana Times’ !
Support ‘Telangana Times’ !
ఈ సంచికలో ఫిబ్రవరి 2008
టైమ్స్ కామెంట్ :
ప్రజల మనిషి, తెలంగాణ ముద్దు బిడ్డ పి.జె.ఆర్. అమర్‌హై ….
అందె శ్రీకి అభినందనలు ….
వ్యాసాలు :
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు - రాజకీయ నేపథ్యం - రాజ్యాంగ ప్రక్రియ - తడకమళ్ల వివేక్ ….
మరలనిదేల ఎస్సార్సీ? - ఎస్. వేణుగోపాల్ ….
ఫజల్ ఆలీ కమీషన్ నివేదికలో ఏముంది? ….
మొత్తం చదవండి »
టైమ్స్ కామెంట్ ఫిబ్రవరి 2008
పి.జె.ఆర్.గా హైదరాబాద్ నగర ప్రజల గుండెల్లో స్థిరపడిపోయిన పి. జనార్ధన రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఒక చారిత్రిక సందర్భంలో హఠాత్తుగా మన మధ్యలోంచి వెళ్లిపోవటం నగర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఒక పెను విషాదం. పూరించలేని ఒక లోటు. తెలంగాణ తల్లి కన్న ముద్దు బిడ్డ. తెలంగాణకు జర్గుతున్న అన్యాయలపై, వివక్షతలపై అలుపెరగకుండా, మడమ తిప్పకుండా తాను పోరాడటమే గాదు తెలంగాణ ప్రజా సంఘాలకు తన మద్దతును, సంఘీభావాన్ని తెలిపాడు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనల్ని, 610 జివో అమలు వైఫల్యాలని ఎండగడుతూ తెలంగాణ ఉద్యోగుల సంఘం వేదికలపై నుంచి ప్రసంగించారు. మొత్తం చదవండి »
వ్యాసాలు ఫిబ్రవరి 2008
- తడకమళ్ల వివేక్
రాష్ట్రాల పునర్ వ్యవస్తీరకణ భాషా ప్రాతిపదికన చేయబడిందని విస్త్రుత ప్రచారంలోవుంది. ఇది ఎంత వరకు నిజం అని ప్రశ్నిస్తే ఇది చాలా వరకు అబద్దం అని తెలుస్తుంది. భాషను ప్రాతిపదికగా తీసుకుంటే రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు ప్రాతిపదికగా ఇనాటి భారతదేశంలో 22 రాష్ట్రాలు మాత్రమే ఉండాలి. అందుకు భిన్నంగా మరి ఈ రోజు 28 రాష్ట్రాలు వున్నాయి.
వ్యాసాలు ఫిబ్రవరి 2008
- ఎన్. వేణుగోపాల్
ఈ రావణ కాష్టం ఈ దేశంలో ఎప్పటికి చల్లారదనే స్పష్టమైన అవగాహనతోనే, ‘మరలనిదేల రామాయణంబన్న’ అని తానే ప్రశ్న వేసుకుని ‘తినిన అన్నమే తిననియట్లు, చేసిన స్నానమే చేసినయుట్లు’ అని జవాబు చెప్పుకుని రామాయణ కల్పవక్షం రాశారు విశ్వనాథ సత్యనారాయణ. విలీనానికి ముందు నుంచీ, 1952 నుంచీ రగులుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎప్పటికి అరిపోదనే స్పష్టమైన అవగాహనతోనే, మొత్తం చదవండి »
వ్యాసాలు ఫిబ్రవరి 2008
దక్షిణ భారతదేశంలో రాష్ట్రాల పునర్వవ్యవస్థీకరణ చాలా వరకు హైదరాబాద్ రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. 18.7 మిలియన్ల జనాభా ఉన్న రాష్ట్రం హైదరాబాద్. వీరిలో 47.8 శాతం మంది తెలుగు, 24.3 శాతం మంది మరాఠీ, 11.6 శాతం మంది ఉర్దు, 10.5 శాతం మంది కన్నడం, 5.8 శాతం మంది ఇతర భాషలు మాట్లాడతారు. హైదరాబాద్ రాష్ట్రంలో రాయచూర్, గుల్బర్గా జిల్లాలను ప్రతిపాదిత కర్ణాటక రాష్ట్రంలో చేర్చాలని ముందటి అధ్యాయంలో సిఫార్సు చేయడం జరిగింది. మొత్తం చదవండి »
ప్రకటనలు ఫిబ్రవరి 2008
1990లో ప్రారంభమైన వర్తమాన తెలంగాణ ఉద్యమం పదిహేనేండ్లలో అనేక మలుపులు తిరిగి, అనేక కీలక దశలను దాటుకుని రాజీనామాలదాకా వచ్చింది. తెలంగాణ భావ చైతన్యం ప్రజల్లో ఇంకిపోయే కృషిలో అందరి పాత్ర ఉన్నది. 2009 లోపునే తెలంగాణ సాధించుకునేందుకు మనమేం చెయ్యాలి? ఉద్యమం ఏ దిశలో నడవాలి? మొత్తం చదవండి »
టైమ్స్ రిపోర్ట్ ఫిబ్రవరి 2008
- సంగిశెట్టి శ్రీనివాస్
రాష్ట్రాల సరిహద్దులు పునర్నిర్ణయించడానికి కేంద్రంలోని యూపిఎ ప్రభుత్వం ఒక్క రాయి యిసిరి సూసింది. అది సీద తేనే తుట్టెకు తగిలింది. దీంతోటి మళ్లోసారి చిన్న రాష్ట్రాలు మనగలవా? ‘ప్రాంతీయ కమిటీ’మే పరిష్కారం, ఈ టర్మ్‌లో ఇంతే సంగతులు, ఏకాభిప్రాయ సాధన, రజాకార్ల రాజ్యం, నక్సలైట్ల రాజ్యం అంటూ కాంగ్రెస్ గిసా పిటా రికార్డుని తిర్లేసి - మర్లేసి పాడిస్తుంది.
టైమ్స్ రిపోర్ట్ ఫిబ్రవరి 2008
కూర్పు: సంగిశెట్టి శ్రీనివాస్ (ప్రొఫెసర్ హరనాథ్ సహాకారంతో)
తెలంగాణ ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు రాదు అనే స్థితికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్ర వాదులందరూ తమ గళాన్ని మరింత బలంగా నివిపించాల్సి సమయం ఆసన్నమయింది. కోస్తాంధ్ర వలసవాదులు చేస్తున్న కుతర్కాలకు ధీటైన జవాబులిచ్చేందుకు తగిన సమాచారం, అంకెలు మనకిప్పుడు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించి దేశంలో వివిధ సందర్భాల్లో వచ్చిన కమిటీలు, వాటి నివేదికలు, అవి అమలు జరిగిన తీరుని కాలక్రమ ప్రకారంగా ఇక్కడ ఇవ్వడమైంది.
టైమ్స్ రిపోర్ట్ ఫిబ్రవరి 2008
- సి. విఠల్ & శ్రీధరరావు దేశ్‌పాండే
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని ప్రజాస్వామికంగా దేశ సమగ్రతను పెంపొందించేందుకు దోహదం చేసే విధంగా రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ జరగాలని భారత ప్రభుత్వం భావించింది. 1953లో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమీషన్ నియమించడం, 1955 నాటికి కమీషన్ సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం, 1956లో కమీషన్ సిఫార్సులను బుట్టదాఖలు చేసి భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ జరగటం అందర్కి తెల్సిన చరిత్రే. మొత్తం చదవండి »
టైమ్స్ రిపోర్ట్ ఫిబ్రవరి 2008
ఈ రోజు ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైన ఈ భాగ్యం మాదే అనే శీర్షికలో పొందుపరిచిన అంశాలు, గణాంకాలు వాస్తవ విరుద్దంగా ఉన్నాయని తెలంగాణ విద్యావంతుల వేదిక భావిస్తున్నది. ఈ శీర్షికలో రాజధాని నుంచి వచ్చే ఆదాయానికి రంగారెడ్డి జిల్లా ఆదాయాన్ని కలిపి మిగతా తెలంగాణ నుంచి వచ్చే ఆదాయం కేవలం 14%గా చిత్రీకరించడం వాస్తవాలను వక్రీకరించడమే అవుతుంది. మొత్తం చదవండి »
టైమ్స్ రిపోర్ట్ ఫిబ్రవరి 2008
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలను ఉద్యమాలకు సమీకరించి నాయకులే ఉద్యమాలకు సారధ్యం వహిస్తే తప్ప ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదని మహారాష్ట్ర రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ జోగేందర్ కవాడే హెచ్చరించారు. తేది|| 09.12.2007న వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజి ఆడిటోరియంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రెండో రాష్ట్ర మహాసభలు నిర్వహించగా ఈ సభల్లో ముఖ్య అతిథిగా కవాడే పాల్గొన్ని ప్రసంగించారు. మొత్తం చదవండి »
టైమ్స్ రిపోర్ట్ ఫిబ్రవరి 2008
ప్రత్యేక తెలంగాణ, విదర్భ స్వాతంత్య్ర సంగ్రామానికై ప్రజల్ని చైతన్యవంతం చేయాలని నాగుపూర్ విశ్వవిద్యాలయం అంబేద్కర్‌ఆలోచన విభాగం అధిపతి డాక్టర్ ప్రదీప్ ఆగ్లావే రచయితలకు, కళాకారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రచయితల వేదిక నాలుగవ రాష్ట్ర మహాసభలు కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని వాసవీ కళ్యాణ మండపంలో జనవరి12న జరిగాయి. తెరవే రాష్ట్ర అధ్యక్షులు జూకంటి జగన్నాథం అధ్యక్షత వహించగా, సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ ఛైర్మన్ చిక్కాల రామారావు అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. మొత్తం చదవండి »
టైమ్స్ రిపోర్ట్ ఫిబ్రవరి 2008
పల్లెలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్లు ఉన్న ఊరిని వదిలిపెట్టి విదేశాలకు ఎందుకు వెళ్తారు? ప్రవాస భారతీయులు పల్లెటూళ్లతో తమ అనుబంధాన్ని మరచి మహానగరాల్లో ఉత్సవాలు ఎందుకు చేసుకుంటారు?
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ మారుమూల పల్లెలో ఎనిమిదో తరగతి చదువుతున్న చెంచు విద్యార్థి మదిలో రగిలిన ప్రశ్నలివి. ‘పల్లె తెలంగాణ ప్రజాయాత్ర’ పేరుతో వచ్చిన పాలమూరు ఎన్నారై ఫోరమ్ ప్రతినిధులను ఆ విద్యార్థి నిర్మొహమాటంగా నిలదీశాడు. మొత్తం చదవండి »
టైమ్స్ రిపోర్ట్ ఫిబ్రవరి 2008
తెలంగాణపై త్వరలోనే తెలుగుదేశం పార్టీ వైఖరీని వెల్లడిస్తుందని, ఆ పార్టీ శాసన సభ పక్ష ఉప నాయకుడు టి. దేవేందర్ గౌడ్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన డైరీల ఆవిష్కరణ ఆదివారం రవీంద్రభారతిలో జరగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవేందర్ గౌడ్ ప్రసంగిస్తూ తెలంగాణ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం చదవండి »
టైమ్స్ రిపోర్ట్ ఫిబ్రవరి 2008
తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఆమోదించిన తీర్మానాలు.
టైమ్స్ రిపోర్ట్ ఫిబ్రవరి 2008
తెలంగాణ ఇవ్వకుండా ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీ తుక్కు తుక్కుగా ఓడిపోతుంది. తెలంగాణ రాకుండా అడ్డుకునే వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లతో పాతరేస్తారు. 50 ఏళ్లుగా తెలంగాణను మోసం చేస్తూ వచ్చాం. ఇంకెన్ని సార్లు చేస్తాం. ఇప్పుడు కూడా ఇలాగే అంటే నడవదు అని కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్యుసీ సభ్యుడు జి. వెంకటస్వామి నిప్పులు కక్కారు. మొత్తం చదవండి »
టైమ్స్ రిపోర్ట్ ఫిబ్రవరి 2008
“1969లో నిజలింగప్ప… ఇప్పుడు వీరప్ప… మధ్యలో మతిలేని బుడ్డర్‌ఖాన్ మారెప్ప!”
” దక్షిణ తెలంగాణలో దండోరా మోగింది. నల్లగొండలో నగారా మోగింది”
“పదవులు మాకు గడ్డిపోచలు. అందుకే రాజీనామా చేసి బలిపీఠమోక్కాం” అంటూ కేసీఆర్
తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విరుచుకుబడ్డారు. వారంతా పదవుల కోసం పెదవులు మూసుకున్నారంటూ దుమ్మెత్తి పోశారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌కు తొత్తులుగా మారారంటూ ధ్వజమెత్తారు. మొత్తం చదవండి »
ఈ నెల కవిత ఫిబ్రవరి 2008
- గడ్డంపల్లి భూపాల్ రెడ్డి
వస్తదంట వస్తదంటర్లో ‘ఒలచ్చుమన్నా
తెలంగాణ మొస్తదంటర్లో ||వస్తదంట||
వస్తదంట వస్తదంట కాంగిరేసే ఇస్తదంట
ఆస్తులను అమ్మేసినంక ఆగమాగం జేసినంక
కొలువులను మింగేసినంక నదుల నీళ్ళను దోసినంక ||వస్తదంట||
టైమ్స్ రిపోర్ట్ ఫిబ్రవరి 2008
డిసెంబర్ 28న మరణించిన తెలంగాణ ముద్దు బిడ్డ, కాంగ్రెస్ సీనియర్ నేత, కార్మిక నాయకుడు, ఖైరతాబాద్ శాసనసభ్యుడు పి. జనార్దన రెడ్డి అంత్యక్రియలు డిసెంబరు 29న హైదరాబాద్‌లోని అంబర్‌పేట శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ప్రశాంతంగా జరిగాయి. వేల సంఖ్యలో వచ్చిన అభిమానులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ 4.15 గంటలకు తండ్రి చితికి నిప్పంటించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు వివిధ ప్రజా ప్రతినిధులు, నేతలు శ్మశాన వాటికకు ముందే దివంగత నేతలకు నివాళులర్పించారు. మొత్తం చదవండి »